Namaste NRI

దేవుడి ద‌య‌వ‌ల్లే మీముందు : ట్రంప్

దేవుడు త‌న వైపు ఉన్న‌ట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిల్‌వాకీలో జ‌రిగిన రిప‌బ్లిక‌న్ పార్టీ క‌న్వెన్ష‌న్‌లో ఆయ‌న మాట్లాడారు. గ‌త శ‌నివారం హ‌త్యాయ‌త్నం జ‌రిగిన త‌ర్వాత తొలిసారి ట్రంప్ త‌న‌కు జ‌రిగిన దాడి గురించి ప‌బ్లిక్‌గా వివ‌రించారు. ర‌క్తం చిందుతున్నా, తాను సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఫీల‌య్యాయ‌ని, ఎందుకంటే దేవుడు త‌న వైపు ఉన్నాడ‌ని ట్రంప్ పేర్కొన్నారు. చివ‌రి క్ష‌ణంలో తాను త‌న త‌ల తిప్ప‌కుండా ఉంటే, అప్పుడు ఆ బుల్లెట్ స‌రిగ్గా ల‌క్ష్యాన్ని తాకేద‌ని, ఈ రోజు ఇలా మీతో ఉండేవాడిని కాదు అని ట్రంప్ చెప్పారు. దేవుడి ద‌య‌వ‌ల్లే మీముందు నిల‌బ‌డిన‌ట్లు తెలిపారు. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీప‌డేందుకు ట్రంప్ నామినేష‌న్ స్వీక‌రించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]