Namaste NRI

గాడ్సే వచ్చేది ఆరోజే

టాలీవుడ్‌ యువ హీరో సత్యదేవ్‌ నటిస్తోన్న తాజా చిత్రం గాడ్సే. గోపీ గణేశ్‌ పట్టాబి దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. అవినీతిమయమైన రాజకీయ నాయకుణ్ణి వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే యువకుడి పాత్రలో సత్యదేవ్‌ కనిపిస్తారు.  ఐశ్వర్యాలక్ష్మి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెసింగ్‌ అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. గాడ్సే 2022 మే 20న విడుదల కానుంది. ఈ చిత్రంలో తనికెళ్లభరణి, నాగబాబు కొణిదెల బ్రహ్మాజీ, నోయెల్‌ సీన్‌, ప్రియదర్శి, నాజర్‌, సిజ్జు మీనన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సునీల్‌ కాశ్యప్‌, సాండీ అద్దంకి మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events