బీచ్ వాలీబాల్‌లో అమెరికా మహిళల జట్టు అదరగొట్టింది. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో అలిక్స్ క్లినెమాన్`ఎప్రిల్ రాన్‌లతో కూడిన యూఎస్ జంట 21`13, 21`15తో ఆస్ట్రేలియాకు చెందిన మరిఫె అర్టాచో`తలికా క్లాన్సీ జోడీని చిత్తు చేసి స్వర్ణం ఎగరేసుకుపోయింది. స్విట్జర్లాండ్ ద్వయం అనౌక్ వర్గె`జొహానా ఎడ్రిచ్ 21`19, 21`15తో లాత్వియ జంట టినా గ్రౌడియా`అనస్తీసియా క్రవికోవాను ఓడిరచి కాంస్య పతకం అందుకుంది.