తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామల అమెరికాలో జరిగే స్విమ్మింగ్ అడ్వైంచర్‌లో బరిలోకి దిగనున్నారు. అత్యంత చల్లని నీళ్లు, లోతైన ప్రాంతమైన కేటాలిన్ ఐలాండ్ నుంచి లాస్‌ఏంజిల్స్ వరకు (సుమారు 36 కిలోమీటర్లు) జరిగే రేసులో శ్యామల పోటీపడనుంది. ఇప్పటికే పాక్ జలసంధి (30 కిలోమీటర్లు) ఈదిన రెండో మహిళగా అరుదైన రికార్డు నెలకొల్పింది శ్యామల. ఇందుకోసం త్వరలో అమెరికాకు బయల్దేరి వెళుతున్న శ్యామలను తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. దేశ, రాష్ట్ర ఖ్యాతి ఇనుమడిరపజేయాలని ఆకాంక్షించారు. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని శ్యామల కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, శ్యామల కోచ్ ఆయుష్ యాదవ్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేశ్ పాల్గొన్నారు.