అజిత్ కథానాయకుడు నటించిన బహుభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 10న పానిండియా స్థాయిలో సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ సంభవం సెలబ్రేషన్స్‌ని హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు.

తమ సంస్థ నుంచి వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ అని నిర్మాత నవీన్ యర్నేని అన్నారు. ఈ సినిమా విజయానికి కారణం టీమ్. ఇంత అద్భుతమైన టీమ్ దొరకడం దర్శకునికి వరం. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన అజిత్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నా అని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ పేర్కొన్నారు. ఇంకా నటుడు సునీల్, ప్రియా ప్రకాష్ వారియర్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, డీవోపీ అభినందన్, ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ కూడా మాట్లాడారు.
