
అజిత్ కథానాయకుడుగా నటించిన బహుభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. త్రిష కృష్ణన్ కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 10న పానిండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. విభిన్నమైన అవతారాల్లో నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఈ ట్రైలర్‌లో అజిత్ కనిపిస్తున్నారు. కొడుకుని కాపాడుకోవడానికి భయంకరమైన తన పాత జీవితంలోకి తిరిగి వచ్చే ఓ తండ్రి పాత్రలో అజిత్ కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన పాత్ర చిత్రణ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. భయాన్నే భయపెడతాడనే డైలాగ్ హీరో క్యారెక్టర్ పవర్‌ని సూచిస్తున్నది. అధిక్ రవిచంద్రన్ మెస్మరైజింగ్ ప్రజెంటేషన్, అజిత్ మాస్ అప్పీల్, అద్భుతమైన విజువల్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలకపాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, సమర్పణ: గుల్షన్‌కుమార్,
