Namaste NRI

మేడారం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌

తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర.  ఈ నెల 21 నుంచి 24వరకు మహా జాతర జరగనుంది. ఈ మేరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మేడారం వెళ్లాలనుకునే భక్తులు ఎలాంటి ప్రయాసలు లేకుండా ఈజీగా అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నది. హైదరాబాద్‌, హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లి మేడారం సమ్మక సారలమ్మలను దర్శిం చుకునే వీలు కల్పిస్తున్నది. ఈ మేరకు హెలిటాక్సీ సంస్థ తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్‌ హెలీకాప్టర్‌ అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 25 వరకు హెలికాప్టర్‌ సేవలు అందించనున్నది. అక్కడ ఏడు నిమిషాల పాటు ఆకాశం నుంచి జాతరను వీక్షేందుకు జాయ్‌ కూడా హెలిటాక్సీ ఏర్పాటు చేసింది.

హనుమకొండ- మేడారం-హన్మకొండ షటిల్‌ ఒక్కొక్కరికి రూ.28,999 టికెట్‌ నిర్ణయించారు. ఈ ప్రయాణంలో భక్తులు హనుమకొండ నుంచి బయలుదేరి మేడారంలో హెలీకాప్టర్‌ దిగొచ్చు. అక్కడ వీఐపీ దర్శనం అనంత రం తిరిగి హనుమకొండలో దింపుతారు. 20-30 నిమిషాల్లో హనుమకొండ నుంచి మేడారానికి తీసుకెళ్లే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే మేడారంలో ఏరియల్‌ (జాయ్‌ కింద 7నిమిషాలపాటు గాలిలో తిప్పేందు కు ఒక్కొక్కరు రూ.4,300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజధాని హైదరాబాద్‌ మేడారానికి కూడా ప్యాకేజీని ప్రకటించారు. ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన చాపర్‌లో ఒక్కరికి రూ.95,833గా టికెట్‌ ధరను నిర్ణయించారు. బేగంపేట ఎయిర్‌ నుంచి హెలీకాప్టర్‌ను నడిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 7483432752, 9400399999 నంబర్లలో సంప్రదించవచ్చునని సంస్థ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events