కువైత్‌లోని భారత ప్రవాసులకు గూగుల్ పే గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే మార్చి నుంచి ఆ దేశంలో తమ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ మూడు బ్యాంకులకు గూగుల్ పే సేవలను ప్రారంభించడానికి అవసరమైన పర్మిషన్ ఇచ్చింది. ఇలా లైసెన్స్ పొందిన బ్యాంకులు మార్చి స్టార్టింగ్ నుంచి కొత్త గూగుల్ పే సర్వీసులను ప్రారంభిస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఎలక్ట్రానిక్ చెల్లింపుల సేవ అనేది అందరికీ తెలిసిందే. దీంతో క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే హువాయి ఫోన్లు, గూగుల్ పిక్సెల్, ఇతర అనుకూల పరికరాలలో ఈ సర్వీస్ పని చేస్తుంది.