అమెరికన్ హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసిన వారికి శుభవార్త. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ వీసాలకు రెండో విడత లాటరీ పూర్తి చేశారు. అమెరికన్ సంస్థల్లో చేరే ప్రత్యేక నైపుణ్యాలు గల ఉద్యోగులకు హెచ్1-బీ వీసాలు జారీ చేస్తారు. ప్రధానంగా అమెరికన్ టెక్ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలసంఖ్యలో ఉద్యోగులను ఈ వీసా ద్వారా నియమిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1-బీ వీసాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి తగిన సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్) మంగళవారం వెల్లడించింది. అక్టోబరు ఒకటవ తేదీతో ప్రారంభమయ్యే ఈ ఆర్థిక సంవత్సరానికి హెచ్1-బీ వీసాలకు అర్హత సాధించిన వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)