Namaste NRI

భారతీయ విద్యార్థులకు శుభవార్త…ఈ ఏడాది రికార్డు స్థాయిలో

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త.  గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్లు ఆమెరికా ఎంబసీ అధికారిణి పాట్రిసియా లసినా తెలిపారు. 2021 వేసవిలో రికార్డు స్థాయిలో సుమారు 62 దేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని, ప్రస్తుత ప్రవేశాల కోసం లక్ష దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటు నందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో విలువనిస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు అని పాట్రిసియా పేర్కొన్నారు.  ప్రస్తుతం 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారని, మొత్తం విదేశీ విద్యార్థుల్లో వారి సంఖ్య 20 శాతానికి పైగా ఉందని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events