భారతీయ విద్యార్థుల కోసం అగ్రరాజ్యం అమెరికా ప్రత్యేక కోర్సులు రూపొందించింది. మన దగ్గర 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానాని కి అనుగుణంగా ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఇలా స్పెషల్ కోర్సు లకు రూపకల్పన చేసింది. భారతీయ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా మన విద్యార్థులు అక్కడి యూనివర్సిటీలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. వచ్చే ఏడాది సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండేందుకు అవకాశం ఉంటుంది. యూఎస్‌కు చెందిన ఇరవై విశ్వవిద్యాలయాలు, 15 భారత విశ్వవిద్యాలయాలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు మొదలెట్టాయి.














