Good news for Indian travelers
భారత్‌లో కొవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడంతో అమెరికా ప్రయాణ నిబంధనలను సడలించింది. ఈ మేరకు భారత్‌కు చేసే ప్రయాణాలకు సంబంధించి అడ్వైజరీ స్థాయి (లెవెల్)ని 4 నుంచి 3కి తగ్గించింది. ఇంత వరకు లెవెల్ 4 అడ్వైజరీ ప్రకారం భారత్‌కు ప్రయాణాలపై పూర్తి నిషేధం ఉండేది దీన్ని తగ్గించడంతో ఇక ప్రయాణాలు చేయదలిచిన పౌరులకు ఆ నిర్ణయాన్ని పున పరిశీలించాలని సూచిస్తారు. కొవిడ్ డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 21 వరకు పొడిగిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. తొలిసారి ఏప్రిల్ 22న విమానాల రాకపోకలపై నిషేధం విధించిన కెనడా దీన్ని పొడిగించడం ఇది నాలుగోసారి.