భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం లభించిన విషయం తెలిసిందే. దీంతో అగ్రరాజ్యం అమెరికా కూడా కోవాగ్జిన్ తీసుకున్న భారతీయ ప్రయాణికులను తమ దేశానికి వచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కీలక ప్రకటన చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ ఆమొదం పొందిన కోవాగ్జిన్‌ను ఎఫ్‌డీఏ కూడా అనుమతి ఇస్తోంది. కనుక కోవాగ్జిన్ తీసుకున్న భారత ప్రయాణికులు కూడా అమెరికా రావచ్చు అని వెల్లడిరచింది. డబ్ల్యూహెచ్‌ఓ, ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టీకాలతో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీయులను తమ దేశానికి వచ్చేందుకు అమెరికా గతవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)