జర్మనీ వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యం కలిగిన భారత కార్మికులకు వర్క్ వీసా ప్రాసెస్‌ను సులభతరం చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. బెంగళూరులోని హైటెక్ హబ్‌ను సందర్శించిన సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ విలేకరులతో మాట్లాడుతూ దేశం నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతతో పోరాడుతున్నందున భారతదేశం నుండి సమాచార సాంకేతిక నిపుణులు జర్మనీలో వర్క్ వీసాలు పొందడాన్ని సులభతరం చేయాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. అలాగే సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఐటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఉన్నవారికి జర్మనీలో మరింత ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను మెరుగుపరచడాన్ని ఈ ఏడాది తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని స్కోల్జ్ చెప్పారు. ఈ సందర్భంగా మేము వీసాల జారీని మరింత సులభతరం చేయాలనుకుంటున్నాం అని ఆయన స్పష్టం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)