Namaste NRI

భారతీయులకు శుభవార్త.. ఆగస్టు 1 నుంచి ఈ-వీసాలు 

రష్యాలో పర్యటించాలనుకునే భారతీయులకు శుభవార్త. వీసా జారీ ప్రక్రియను రష్యా సులభతరం చేయనుంది. భారత పాస్‌పోర్ట్‌ ఉన్న వారికి ఆగస్టు 1 నుంచి ఈ-వీసాలను జారీచేయనున్నట్టు ప్రకటించింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఇకపై ఆన్‌లైన్‌లోనే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ఇరుదేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసిన నాలుగు పనిదినాల్లోగా ఈ-వీసాను ప్రాసెస్‌ చేయనున్నారు. అప్లికేషన్‌ ఫీజు 40 డాలర్లు. ఆన్‌లైన్‌లోనే దీన్ని చెల్లించొచ్చు. 60 రోజుల పాటు ఈ-వీసా చెల్లుబాటు అవుతుంది. ఇండియాతోపాటు 52 దేశాలకు రష్యా ఈ-వీసా సౌకర్యాన్ని అందిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events