ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆప్లికేషన్లను క్లియర్ చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడుకి తమ ప్రతిపాదనలను పంపింది. బైడెన్ సర్కార్ ఆ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపితే అప్పుడు వేలాది మంది భారతీయులకు గ్రీన్ కార్డు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏషియన్ అమెరికన్లు, స్థానిక హవాయి ప్రజలు, పసిఫిక్ దీవులకు చెందిన వాళ్లతో ఏర్పడిన అడ్వైజరీ కమిషన్ చేసిన ప్రతిపాదనలను ఆమోదం కోసం వైట్‌హౌజ్‌కు పంపనున్నారు. ఒకేవేళ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడు ఎన్నో దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే ఛాన్సు ఉంటుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)