భారత్‌లో వైద్య విద్య అభ్యసించినవారు నేరుగా అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో వైద్యసేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. భారత్‌లో వైద్య విద్యను నియంత్రించే నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ)కు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూఫ్‌ఎంఈ) గుర్తింపు లభించింది. దీంతో ఎన్‌ఎంసీ గుర్తింపు ఉన్న భారత్‌లోని 706 మెడికల్ కాలేజీలకు కూడా ఆటోమెటిక్‌గా డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు లభించింది. వచ్చే పదేండ్లలో దేశంలో ప్రారంభించబోయే మెడికల్ కాలేజీలకు కూడా డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు లభిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఎన్‌ఎంసీ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్ చదివినవారు విదేశాల్లో నేరుగా ప్రాక్టీస్ చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. విదేశాల్లో మెడికల్ పీజీ కోర్సులు చదవటానికి కూడా సమస్యలు తొలగిపోతాయి.
