మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. హీరో రామ్‌చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని హీరో రామ్‌చరణ్ తండ్రి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్‌చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా తమ తొలి బిడ్డని త్వరలో ఆహ్వానించనున్నారు. ప్రేమతో మీ సురేఖ, చిరంజీవి, శోభన` అనిల్ కామినేని ( ఉపాసన తల్లిదండ్రులు) అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా ఉపాసన- రామ్‌చరణ్‌లకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)