Namaste NRI

మెగా ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. గాడ్‌ ఫాదర్‌ ఫస్ట్‌ లుక్‌

మెగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు గాడ్‌ ఫాదర్‌ మూవీ మేకర్స్‌.  చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్‌ఫాదర్‌. మలయాళంలో విజయవంతమైన లూసిఫర్‌ కి రీమేక్‌గా రూపొందుతోంది. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పకులు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. చిరంజీవి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో దర్శనమిస్తున్నారు.  రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు స్పష్టం చేశాయి. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: నీరవ్‌ షా, కళ: సురేష్‌ సెల్వరాజన్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌. నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ఫిల్మ్స్‌, స్కీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌ రాజా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events