మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇందులో రవితేజ ఓ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రాన్ని చకచకా ముస్తాబు చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు దీవపాళికి టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. దీనిపై చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్పందిస్తూ బాబీకి అభినందనలు. మీ కల నిజం కాబోతోతుంది. దీపావళికి బాస్ ఎగ్జైటింగ్ టీజర్. నేను బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేశారు. మీ అందరితో కలసి సంక్రాంతికి మెగా మాస్ ఎంటర్టైనర్ చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నారు. వైజాగ్ నేపథ్య కథాంశంతో మాస్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నిరజంన్ దేవరమానే, ఛాయాగ్రహణంం ఆర్థర్ ఎ విల్సన్. నిర్మాతలు : నవీన్ యెర్నేనీ, వై. రవివంకర్ దర్శకత్వం: రవీంద్ర (బాబీ). ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.














