ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. జీతాలు రెట్టింపు చేస్తామని ఆ సంస్థ అధినేత సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ విషయాన్ని ఉద్యోగులందరికీ సత్య నాదెళ్ల స్వయంగా మెయిల్ ద్వారా వెల్లడిరచారు. ఈ నిర్ణయంతో సిబ్బందికి స్టాక్న్ రూపంలో ఇచ్చే సౌలభ్యాలు పెరగనున్నాయి. ఇటీవల కాలంలో సంస్థలో చేరినవారు, కెరీర్ మధ్యలో ఉన్న వాళ్ల జీతాల్లో ఈ పెరుగుదల ప్రధానంగా కనిపించనుందన్నారు. సంస్థలో చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరు ఎంతో చక్కటి, అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని సత్య నాదెళ్ల తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు చెప్పకొచ్చారు. ఉద్యోగులు ఎంతో కష్టపడి పని చేస్తుండటంతోనే కంపెనీ లాభాలు పొందుతోందన్నారు.