బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ఎన్బీకే 108 రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలో కాజల్, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి టీం నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ఈ సందర్భంగా విజయదశమికి ఆయుధపూజ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఉగాది సందర్భంగా విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ఈ సారి కూడా రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నాడు. ఎన్బీకే 108 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సి.రామ్ ప్రసాద్, సంగీతం : తమన్.

