పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా మైత్రి మూవీ మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఎక్స్‌పెక్ట్ ది అన్ ఎక్స్‌పెక్టెడ్ అంటూ మార్చి 19 డేట్‌తో ఓ పోస్ట్ పెట్టింది ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఇక ఈ పోస్టులో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సెషన్‌లో పాల్గొన్న ఫొటోలు కనిపించాయి. అంటే మార్చి 19న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
