Skip to main content

Namaste NRI

పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఓజీ2 అప్‌డేట్‌

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ ఫ్రాంచైజీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, ఓజీ యూనివర్స్ తో పాటు ఓజీ 2కు సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓజీ 2 పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా దర్శకుడు సుజీత్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. క్రియేటివ్ వర్క్స్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓజీ భవిష్యత్ ప్రణాళికలు, యూనివర్స్ విస్తరణ, సీక్వెల్ రూపకల్పన వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ అప్‌డేట్ బయటకు రావడంతో పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఓజీ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందా? అనే చర్చలు ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఓజీ మొదటి భాగం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారం, సుజీత్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో సీక్వెల్‌పై అప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Social Share Spread Message

Latest News