Namaste NRI

ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రాజాసాబ్ నుంచి క్రేజీ అప్ డేట్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ చిత్రం.  రాజా సాబ్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఫుల్ ఎంట‌ర్‌టైన్ కూడా అందించేలా ఉంది. సినిమాలో ప్రభాస్ కామెడీ పంచుతూనే అవసరమైన టైం లో హీరోయిజం చూపిస్తాడని చెప్పుకుంటున్నారు.  ఈ  చిత్రాన్ని డిసెంబర్ 5, 2025 నాటికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజర్‌లో ప్రభాస్ రెండు విభిన్న లుక్స్‌తో, కామెడీ, హీరోయిజం రెండు చూపించి అంచనాలు రెట్టింపు చేశాడు. మారుతి ప్రభాస్‌తో ఏదో అద్భుతం చేస్తున్నాడు అని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇందులో మాళ‌విక మోహన్, నిధి అగర్వాల్,రిద్ధి కుమార్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. త‌న మ్యూజిక్‌తో సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ‌తాడ‌ని ముచ్చటించుకుంటున్నారు. రెండు సంవత్సరాల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగిన టీజ‌ర్ కూడా విడుద‌ల చేయ‌లేదంటూ ట్రోల్స్ చేశారు. కానీ ఇటీవల విడుదలైన గ్లింప్స్  చూసిన‌ వెంటనే ఫ్యాన్స్ ఉత్సాహం ఎల్ల‌లు దాటింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జూలై మొద‌టి వారంలో రాజా సాబ్ చివ‌రి షెడ్యూల్ ప్లాన్ చేశార‌ట‌. హైద‌రాబాద్‌లో నిర్మించిన ప్యాలెస్ సెట్‌లో షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని, ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్ కూడా పాల్గొన‌బోతున్నాడ‌ని అంటున్నారు. ఇప్పుడు క్లైమాక్స్ షూట్ చేసి ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వీలైనంత వేగంగా ఫినిష్ చేయాల‌నే క‌సితో మారుతి అండ్ టీం ఉంది.

Social Share Spread Message

Latest News