ప్రభాస్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పానిండియా యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ విడుదల తేదీని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా వెల్లడించారు. 2027 మార్చి 5న స్పిరిట్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నదని ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రభాస్ అకాడమీ టాపర్ అయిన ఐపీఎస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ఓ స్థాయిలో స్పందన వస్తున్నది.

పోలీస్ కథతో పాటు మాఫియా నేపథ్యం కూడా ఇందులో ఉంటుందని, ఇప్పటివరకూ కనిపించని కొత్త అవతారంలో ప్రభాస్ కనిపిస్తారని, సందీప్‌రెడ్డి వంగా ైస్టెల్ పవర్‌ఫుల్ ప్రభాస్‌ని ప్రేక్షకులు చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి కాంచన, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రధారులు. టి.సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.















