ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్న విద్యార్థులకు శుభవార్త. త్వరలోనే ఎయిర్ ఇండియా నుంచి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. విద్యార్థుల నుంచి ఏర్పడుతున్న డిమాండ్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఆగస్టు మొదటి వారం నుంచి అమెరికాకు విమాన సర్వీసులను పెంచబోతోంది. జూలైలో అమెరికాకు వారానికి పదకొండు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నడపగలిగింది. అయితే ఆగస్టు 7 నుంచి వీటిని 22కు పెంచబోతున్నట్టు సంస్థ తెలియజేసింది. మరోవైపు ఆగస్టు 6, 13, 20, 27న న్యూఢిల్లీ, నేవార్క్ మధ్య అదనంగా ఎయిర్ ఇండియా విమానాలు నడపనుంది. ఈ సెక్టార్‌లో నడుపుతున్న విమాన సర్వీసులకు ఇవి అదనమని పేర్కొంది.