తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 గా ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు. ఈ మూవీ నుంచి లోకేష్ సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ఈ మూవీ నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్‌ను లోకేష్ కనగరాజ్ విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో రజినీకాంత్ లగ్జరీ వాచ్‌లు దొంగతనం చేసే దొంగలా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయను న్నట్లు లోకేష్ తెలిపాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.