Namaste NRI

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆగస్టు 3 నుంచి

 తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్టు 3 నుంచి రుణమాఫీ ప్రక్రియను చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల పంట రుణాలు మాఫీ కానున్నాయి. అర్హత పొందిన ప్రతి రైతుకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తున్నది. రైతు విత్తనం నాటి నుంచి పంట చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ రైతన్నలకు దన్నుగా నిలవడంతో వారంతా ఖుషీ ఖుషీగా ఎవుసం చేసుకుంటున్నారు. సకాలంలో ఎరువులు విత్తనాలు, పంట పెట్టుబడి, నాణ్యమైన విద్యుత్‌, పంట కొనుగోళ్లు, రైతుల కల్లాలు ఇలా ఒకటేమిటి రైతుల అవసరాల మేరకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈసారి సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. తొలి రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజా రుణమాఫీని కూడా కలిపితే ఇది సుమారు రూ.36 వేల కోట్లకు చేరనున్నది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events