యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ప్రయాణ నిబంధనలను సడలించింది. వ్యాక్సిన్ తీసుకొని దేశ పౌరుతలను ఇతర దేశాలకు వెళ్లకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నెల 16 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయితే ప్రయాణికులు తప్పనిసరిగా జర్నీకి 16 గంటలోపు పీసీఆర్ టెస్టు చేయించుకున్న రిపోర్టును చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అలాగే గ్రీన్ స్టేటస్ పొందడానికి అల్ హోస్నా యాప్‌లో ప్రయాణానికి సంబంధించిన ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)