బ్రిటనకు వెళ్లే భారతీయులకు, ఇతర ప్రయాణికులకు గుడ్ న్యూస్. బ్రిటన్ వచ్చే వారు విమాన ప్రయాణానికి ముందే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ సర్టిఫికెట్ సమర్పించనవసరం లేదు. భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్ ఇల్లిస్ తెలిపారు. బ్రిటన్‌కు వచ్చే భారతీయులకు ప్రీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్తో పాటు పలు నిబంధనలను సరళతరం చేసింది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్న యువకులు, 18 ఏండ్లలోపు పిల్లలు ఈ నెల ఏతో తేదీన ప్రీ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
బ్రిటన్‌లోకి రాగానే పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్న యువజనులు, పిల్లలు తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. కరోనా పాజిటివ్ గా వస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ నెల 11 నుంచి ఇండ్లండ్లో విమానాశ్రయంలో దిగిన తర్వాత నిర్వహించే ఫ్లో టెస్ట్‌లో కరోనా అని తేలితే ఆర్టీపీసీఆర్ పరీక్ష అవసరం లేదని బ్రిటన్ హై కమిషన్ కార్యాలయం తెలిపింది. అయితే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని పేర్కొంది.