Namaste NRI

షార్జా వెళ్లేవారికి గుడ్‌న్యూస్ .. ఈ నెల 31 నుంచి

షార్జా వెళ్లేవారికి గుడ్‌న్యూస్.  విజయవాడ-షార్జా మధ్య డైరెక్ట్ విమా న సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ నెల 31న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమాన సర్వీసు ప్రారంభిస్తోంది. ఆ రోజు సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ-షార్జా తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. రూ.13,669 ప్రారంభ ధరతో ఈ సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది.

షార్జా-విజయవాడ సర్వీసు చార్జీ 399 ఎమిరేట్స్ దిర్హమ్స్ (సుమారు రూ.8,946)గా నిర్ణయించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ-షార్జా డైరెక్ట్ విమాన సర్వీసు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. విజయవాడ నుంచి షార్జాతో పాటు మస్కట్, కువైట్లకు కూడా తమ సంస్థ  నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించారు

Social Share Spread Message

Latest News