ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మూడో సారి తండ్రయ్యాడు. ఆయన భార్య ప్రిస్కిలా చాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఈ జంటకు మూడోసారి కూడా అమ్మాయే పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జుకర్ బర్గ్ అని వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్కిల్లా చాన్ మధ్య ప్రేమ చిగురించింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ఆగస్ట్ జన్మించింది. ఇప్పుడు మరో అమ్మాయికి జుకర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు.