రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం సారంగదరియా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం. సాయిజా క్రియేషన్స్ పతాకం పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ, హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జులై 12న విడుదల కాగా, మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈవెంట్‌లో రాజా రవీంద్ర మాట్లాడుతూ సారంగదరియాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. సినిమాలో మోయిన్, మోహిత్, యశస్విని నాకంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇదే నాకు సంతోషకరమైన క్షణం. నా కెరీర్‌లో ఇది ఒక మంచి సినిమాగా నిలిచిందని, నాకు ఇంతమంది అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నాడు.

నేను సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చానని డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి అన్నాడు. ముందుగా కెమెరా విభాగంలో పనిచేసిన నేను చివరకు రాజా సర్‌కు కథ చెప్పాను. కథ విన్న వెంటనే ఒకే చెప్పారు. థియేటర్ కోసమే ఈ సినిమా తెరకెక్కించామని, నిర్మాత శరత్ వల్ల సినిమా ఇక్కడి వచ్చిందని అన్నాడు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు.