Namaste NRI

జులై 29న గుడ్‌లక్‌ జెర్రీ

జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గుడ్‌లక్‌ జెర్రీ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ప్రకటించారు. జులై 29న విడుదల కానున్న ఈ సినిమా నయన తార ప్రధాన పాత్రలో తెరకెక్కి విజయవంతమైన తమిళ చిత్రం కోలమావు కోకిల కు రీమేక్‌. తెలుగులో కొ కో కోకిల పేరుతో విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ జాన్వీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భయం భయంగా చేతిలో గన్‌ పట్టుకుని జాన్వీ చూస్తుండటం కన్పించింది. జాన్వీ కన్పించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్‌కు ఆస్తికరమైన క్యాప్షన్‌ను జాన్వీ జతచేసింది. కొత్త అడ్వైంచర్‌ కోసం నేను బయటకి వచ్చాను. నాకు గుడ్‌ లక్‌ చెప్పరూ అంటూ ఆసక్తికరంగా క్యాప్షన్‌ పెట్టింది. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం  ఓటీటీలోకి రాబోతోంది. లైకా ప్రొడక్షన్‌ సుభాస్కరన్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మించారు.  సిద్దార్థ్‌ సేన్‌గుప్తా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దీపక్‌ దోబ్రి యల్‌, మిటా వశిష్ట, నీరజ్‌ సూద్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events