టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోసారి భారీ షాక్ తగ్గిలింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.936.44 కోట్ల భారీ జరిమానా విధించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా గూగుల్ తన తీరును మార్చుకోవాలని స్పస్టం చేసింది. గూగుల్‌కు సీసీఐ జరినామా విధించడం వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.