Namaste NRI

గూగుల్ సంచలన నిర్ణయం

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించింది. అలాంటి ఉద్యోగులకు జీతాల్లో కోతలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం సిబ్బందికి ఇటీవల మెమో జారీ చేసినట్లు తెలిపింది. డిసెంబరు 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను ప్రకటించి, అందుకు సంబంధించి సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ఒకవేళ వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలతో టీకా నుంచి మినహాయింపు కావాలనుకుంటే దానికోసం దరఖాస్తు చేసుకోవాలని గూగుల్‌ ఆ మెమోలో సూచించింది. ఆ తేదీలోగా వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేయని ఉద్యోగులు, ఇంకా టీకా తీసుకోని వారు, మినహాయింపునకు అనుమతి రాని సిబ్బందిని ప్రస్తుతం గూగుల్‌ కాంటాక్ట్‌ చేస్తోంది. వారందరికీ చివరి అవకాశం కల్పిస్తున్నట్లు గూగుల్‌ ఆ మెమోలో పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events