ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను తమ ప్లాట్ ఫామ్‌పై ప్రోత్సహించకూడదని నిర్ణయించింది. శోతోష్ణస్థితి మార్పుపై తప్పుడూ సమాచారం వ్యాప్తించకుండా నిరోధించడం, అలాంటి సమాచారాన్ని ఇతరులు అర్జనకు ఉపయోగించుకోకుండా నిలిపివేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు కూడా తాజా నిర్ణయం వర్తిస్తుందని వెల్లడిరచింది. శాస్త్రీయాధారితం కానీ శీతోష్ణస్థితి మార్పు సమచారాన్ని ఇతర ప్రకటనకర్తలు తమ ప్రకటనల పక్కన కనిపించాలని కోరుకోరని తెలిపింది. శీతోష్ణస్థితి మార్పు అనేది లేదని చెపుతూ సోమ్ము చేసుకునే వీడియోలను యూట్యూబ్‌లో ఉంచమని పేర్కొంది. ఇలాంటివాటిని నిరోధించాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మార్పు అమలుకు కంపెనీ ఆటోమేటెడ్ టూల్స్‌ను ఉపయోగించనుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)