Skip to main content

Namaste NRI

గోపీచంద్ మలినేని చేతుల మీదుగా  జై జవాన్‌ ట్రైలర్‌ విడుదల

సంతోష్‌ కల్వచర్ల, పావని జంటగా నటిస్తున్న చిత్రం జై జవాన్‌. నాగబాబు పోటు దర్శకత్వం.  సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు నిర్మిస్తున్నారు.  ఈ చిత్ర ట్రైలర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దర్శకుడు మలినేని గోపీచంద్‌ విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిం చిన ఈ చిత్రంలో సైనికులు చేస్తున్న త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపించామని దర్శకుడు తెలిపారు. ట్రైలర్‌లో ఉన్న జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని, జీవితాన్నిచ్చిన మాతృభూమి రుణాన్ని తీర్చుకునేది ఒక జవాన్‌ మాత్రమే అనే సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: బాబు కొలబతుల, రచన-దర్శకత్వం: నాగబాబు పోటు.

Social Share Spread Message

Latest News