గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్ విడుదల తేదీ ఖరారైంది. గోపీచంద్‌కి జోడీగా రాశిఖన్నా నటించారు. కరోనా కరుణిస్తే మేం 20నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇదివరకే ప్రకటించినప్పటికీ, ఆ నిర్ణయంలో మార్పు జరిగింది. ఇందులో గోపీచంద్ న్యాయవాది పాత్రలో సందడి చేస్తారు. రాశిఖన్నా సీరియల్ నటిగా కనిపిస్తారు.ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 1ని విడుదల తేదీగా ఖరారు చేశారు సినీ వర్గాలు. మారుత దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. బన్నీ వాస్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)