సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్ సెలబ్రిటీ. చందిన రవికిషోర్ దర్శకుడు. చిన్న రెడ్డయ్య, పాండురంగారావు నిర్మాతలు. వరలక్ష్మీ శరత్కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాలోని నీ జతగా అంటూ సాగే మెలోడీ గీతాన్ని అగ్ర హీరో గోపీచంద్ విడుదల చేశారు. వినోద్ యాజమాన్య సంగీతాన్నందించిన ఈ పాటను గణేశా రచించగా, జావెద్ అలీ ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గోపీచంద్ పరుచూరి వెంకటేశ్వర్రావు గారి మనవడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, నేటి యువతరం మెచ్చే అన్ని అంశాలుంటాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, రచన-దర్శకత్వం: చందిని రవికిషోర్.