
హీరో గోపీచంద్ తన తాజా చిత్రంలో చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. గోపీచంద్33 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్నది. గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకొని స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మంచుతో కప్పబడిన పర్వతశ్రేణుల నడుమ మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. పొడవాటి జుట్టు, శరీరమంతా గాయాలు, నుదుటిన వీరతిలకం ధరించి యోధుడి పాత్రలో ఆయన కనిపించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా ఉంది. 7వ శతాబ్దం నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, చరిత్ర మరిచిపోయిన ఓ అధ్యాయానికి జీవం పోసే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. అతనో యోధుడు. విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ చిత్రబృందం ఈ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్, రచన-దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.
