గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ నటిస్తున్న 31వ చిత్రమిది. కన్నడ దర్శకుడు ఏ.హర్ష రూపొందిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ మా సంస్థలో నిర్మిస్తున్న 14వ చిత్రమిది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నాం. కన్నడలో మంచి విజయాలు సాధించిన దర్శకుడు హర్షతో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉంది. గోపీచంద్ ఇంతకు ముందు కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు చేసినప్పటికీ, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో కొంత మంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. త్వరలో ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తాం. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : స్వామి జే, సంగీతం : రవి బస్రూర్.
