ఇజ్రాయెల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన వారికి, వైద్య సిబ్బందికి కరోనా టీకా నాలుగో టీకా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ ఈ ప్రకటన చేశారు. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు రూపొందించిన టీకాను రెండో బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు గతవారమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది. కరోనా నుంచి కాపాడే మరో రక్షణ వలయం మనకు అందింది అని ప్రధాని వ్యాఖ్యానించారు. టీకా ప్రయత్నాల్లో ఇజ్రాయెల్ మరోసారి అగ్రగామిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా పెరుగుతున్న కారణంగా దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ అత్యున్నత అధికారి ఒకరు పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)