ఒమైక్రాన్ కరోనా వైరస్‌ను గుర్తించామని నెదర్ ల్యాండ్స్ ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 19, 23 తేదీల మధ్య సేకరించిన శాంపిళ్లలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 24న దక్షిణాఫ్రికా ప్రభుత్వం తొలి ఒమైక్రాన్ కేసు గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నెదర్ ల్యాండ్స్ అధికారులు సేకరించిన శాంపిళ్లు ఆఫ్రికా ఖండం నుంచి తిరిగొచ్చిన ప్రయాణికులవా కాదా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.
ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై పూర్తి సృష్టత లేకపోయినప్పటికీ అనేక దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం మొదలెట్టాయి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ప్రయాణికులపై గట్టి నిఘా పెడుతున్నాయి. అయితే నెదర్ ల్యాండ్స్ ప్రకటనతో ఒమైక్రాన్ చిక్కుముడి మరింత తికమకపెట్ట అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.