Namaste NRI

ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి :రష్మిక

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో సృష్టించిన వీడియోకు రష్మిక మందన్నా బాధితురాలిగా మారింది. జరా పటేల్‌ అనే మహిళ ముఖాన్ని రష్మిక మందన్న ముఖంలా మార్చేసి ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. అది విపరీతంగా వైరల్‌ అయింది.  తన ఇన్‌స్టా ద్వారా ఈ వీడియోపై రష్మిక స్పందించింది. ఇలాంటి విషయాలను పంచుకోవడం చాలా బాధగా ఉంది. ఈ సమయంలో నాపై గౌరవంతో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు.  మానసికంగా ఎదిగిన స్త్రీని కనుక ఈ పరిస్థితిని ఫేస్‌ చేయగలిగాను. అదే నేను చదువుకునే రోజుల్లో ఇలాంటివి సంభవిస్తే, ఎలా తట్టుకునేదాన్నో అని ఊహిస్తేనే భయంగా ఉంది. స్త్రీలకు ఈ టెక్నాలజీ ఒక శాపం. ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పింది రష్మిక. చివరకు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఈ వీడియోపై స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events