Namaste NRI

చిత్ర పరిశ్రమ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం  : కోమటి రెడ్డి

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ టీఎఫ్‌సీసీకి ఆరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైనా ప్రతాని రామకృష్ణగౌడ్‌ను అభినందిస్తున్నా. తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్‌లో తెలంగాణ వారికి ఇళ్లు ఇప్పిస్తాం అని చెప్పారు.

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ టీఎఫ్‌సీసీ సంస్థ సొంత భవనం కోసం ఫిల్మ్‌నగర్‌ లో స్థలం ఇప్పించాలని, అలాగే చిత్రపురి కాలనీలో మా సభ్యులకు ఇల్లు మంజూరు చేయించాలని మంత్రి గారిని కోరుతున్నా. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు.ఈ విషయంలో కూడా మంత్రిగారు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌ సంస్థల అధినేత రమేష్‌ప్రసాద్‌తోపాటు తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events