ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తొలి పూజ నిర్వహించారు. శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. మహాగణపతి 36 అడుగులు ఎత్తు ఉండగా, తలపై ఉన్న సర్పంతో కలుపుకొని 40 అడుగుల ఎత్తు ఉంటుంది. తొలిపూజ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.