గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌వెగాస్‌లోని గ్రాండ్ మార్కీ బాల్రూమ్లో వేడుకగా జరిగింది. భారత సంతతికి చెందిన రిక్కీ కేజ్, ఫాల్గుణి షాలు గ్రామీ అవార్డులను గెలుచుకుని దేశ ప్రతిష్ఠను ఇనుమడిరపజేశారు. డివైన్ టెడ్స్, ఆల్బమ్‌కు గానూ రిక్కీ కేజ్ రెండో సారి గ్రామీ అవార్డును అందుకున్నాడు. స్టెవార్ట్ కోప్ లాండ్‌తో కలిసి రిక్కీ సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ ర్యాక్ బ్యాండ్ లో డ్రమ్మర్ అయిన కోప్లాండ్ డివైన్ టైడ్స్ ఆల్బమ్ కోసం రిక్కీతో జత కట్టాడు. న్యూయార్క్ చెందిన ఫాల్గుణి షా సైతం తొలి సారి గ్రామీ అవార్డును గెలుచుకుంది. పలు పేరుతో సుప్రసిద్ధమైన షా తన ఎ కలర్పూర్ వరల్డ్ ఆల్బమ్‌కి గాను ఈ అవార్డు అందుకుంది.