Namaste NRI

జీటీఏ డెట్రాయిట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ (జీటీఏ) ఆధ్వర్యంలో డెట్రాయిట్‌ చాప్టర్‌లో బతుకమ్మ పండుగ  వేడుకగా జరిగింది. వందలాది మంది మహిళలు తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మలను పేర్చి, గౌరీ దేవిని స్మరిస్తూ జానపద పాటలు పాడుతూ, ఆటలు ఆడారు.  సుమారుగా 50 మంది వలంటీర్లు బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడంలో తమవంతుగా కృషి చేశారు. సుమారు 1500 మంది హాజరై, నోవి సివిక్‌ సెంటర్‌ భవన సదుపాయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా జీటీఏ యూఎస్‌ఏ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ కేసిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచమంతా వ్యాపింపజేయడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో మొదటిసారిగా జరిగిన ఈ వేడుకకు అపూర్వమైన స్పందన లభించిందన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు రుచికరమైన ఆహారం, ఫేస్‌ పెయింటింగ్‌ వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

జీటీఏ యూఎస్‌ఏ ట్రస్టీ బోర్డు సభ్యులు కృష్ణప్రసాద్‌ జలిగామ, సంతోష్‌ కాకులవరం, మల్లికార్జున్‌ పడుకోనే, మహేష్‌ వెనుకదాసుల, డెట్రాయిట్‌ నగర బాధ్యులు కమల్‌ పిన్నపురెడ్డి, వెంకట్‌ నటాల, ప్రేమ్‌ రెడ్డి చింతపల్లి, అరుణ్‌ బచ్చు,  యాదగిరి ఐలేని, అభిలాష్‌ భూమిరెడ్డి, రమాకాంత్‌ బానూరి,  వినోద్‌ ఆత్మకూర్‌, డాక్టర్‌ రాకేష్‌ లట్టుపల్లి, మహేశ్‌ బాబు బురుల్లు, వలంటీర్లు సురేందర్‌ నాగిరెడ్డి, సాయినాథ్‌ లచ్చిరెడ్డిగారి, సందీప్‌ నారాయణప్ప, గోవింద్రాజన్‌ తట్టాయి, రాహుల్‌ పాల్‌ రెడ్డి,   వెంకట్‌ వదనాల, లక్ష్మీనారాయణ కర్నాల, మధుసూధన్‌ రెడ్డి మాలుగారి, సత్యధీర్‌ గంగసాని, శ్రీరామ్‌ జాల, కరుణాకర్‌ కందుకూరి, యుగంధర్‌ భూమిరెడ్డి, పాల్గొన్నారు. కొలరాడోలోని డెన్వర్‌ చాప్టర్‌లోనూ బతుకమ్మ వేడుకను వైభవంగా నిర్వహించారు. నిర్వహణ కమిటీ సభ్యులు సుష్మా పదుకొణె, సుమ కలువల, స్వప్న చింతపల్లి, స్వప్న కాల్వల కార్యక్రమాన్ని పర్యవేక్షించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events